తెలంగాణ

telangana

ETV Bharat / business

సెప్టెంబరు కల్లా కొవావ్యాక్స్‌ టీకా!

సెప్టెంబర్​ కల్లా 'కొవావ్యాక్స్'​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి పొందేందుకు సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ అభివృద్ధి చేసిన టీకాయే కొవావ్యాక్స్.

covavax
కొవావ్యాక్స్, నొవావ్యాక్స్

By

Published : Apr 24, 2021, 8:50 AM IST

అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు మనదేశంలో వెంటనే అనుమతి ఇవ్వాలనే ప్రభుత్వ నూతన నిబంధనలకు అనుగుణంగా కొవావ్యాక్స్‌ టీకాను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సన్నాహాలు చేస్తోంది. కొవిడ్‌-19 నిరోధానికి అమెరికాకు చెందిన నొవావ్యాక్స్‌ అభివృద్ధి చేసిన టీకాయే కొవావ్యాక్స్‌.

కొవావ్యాక్స్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలిని ఎస్‌ఐఐ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా కంపెనీ అయిన నొవావ్యాక్స్‌, తమ టీకా తయారీ కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

'కొవావ్యాక్స్‌' టీకాకు అమెరికాలో అత్యవసర అనుమతి తీసుకునే సన్నాహాల్లో నొవావ్యాక్స్‌ ఉంది. ఒకసారి అక్కడ అనుమతి రాగానే, దానికి వెంటనే మనదేశంలో అనుమతి కోరుతూ దరఖాస్తు చేయనున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ టీకాపై ఇప్పటికే మనదేశంలో భద్రత, సత్తా (ఇమ్యునోజెనిసిటీ, ఎఫికసీ) పరీక్షలను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. అన్నీ పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబరు నాటికి 'కొవావ్యాక్స్‌' ను ఆవిష్కరించాలని ఈ సంస్థ భావిస్తోంది.

ఇదీ చదవండి:దిల్లీ విలయానికి ఆ రకమే కారణమా..?

ABOUT THE AUTHOR

...view details