తెలంగాణ

telangana

ETV Bharat / business

Covid Vaccine For Children: 'ఆరు నెలల్లో పిల్లలకు కరోనా టీకా​'

Covid Vaccine For Children: రానున్న ఆరు నెలల్లో చిన్నపిల్లల కోసం కరోనా టీకాను తీసుకురానున్నట్లు సీరం సీఈఓ అదర్​ పూనావాలా తెలిపారు. కొవిడ్​ బారి నుంచి చిన్నారులను కాపాడేందుకు కొవొవ్యాక్స్​ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు .

Poonawalla
పూనావాలా

By

Published : Dec 14, 2021, 2:48 PM IST

Covid Vaccine For Children: మరో ఆరు నెలల్లో చిన్నారుల కోసం కొవిడ్‌ టీకాను తీసుకురానున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉందని వివరించారు. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చని తెలిపారు. ప్రస్తుతం సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు.

అదృష్టవశాత్తు చిన్నారుల్లో కొవిడ్‌ తీవ్రమైన అనారోగ్యం కలిగించడం లేదని పునావాలా అన్నారు. ఇప్పటికే భారత్‌లో రెండు కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి పొందినట్లు గుర్తు చేశారు. చిన్నారులకు టీకా వేయించాలనుకునే వారు ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు పూనావాలా.

ఇదీ చూడండి:బూస్టర్​ డోస్ అవసరమా? భారత్​లో ఎప్పుడు?.. కేంద్రం జవాబులివే..

ABOUT THE AUTHOR

...view details