కొవిడ్-19 టీకాలను పది కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత్ సహా ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందని దేశాల కోసమే ఇలా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 100 మిలియన్ డోసుల కొవిడ్ టీకాల ఉత్పత్తి, సరఫరా కోసం ఆగస్ట్‌లో గవి, మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది సీరమ్.
'పేద దేశాల కోసం 10 కోట్ల కరోనా టీకా డోసులు'
భారత్ సహా ఆర్థికంగా వెనుకబడిన దేశాల కోసం పది కోట్ల కొవిడ్ టీకా డోసులను అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. ఈ టీకాల ఉత్పత్తికి.. గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ టీకాలను సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.
సీరం ఇన్‌స్టిట్యూట్ పది కోట్ల డోసులు
వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మిలిందా గేట్స్ ఫౌండేషన్-గవి ఒప్పందంతో మొత్తం 200 మిలియన్ డోసుల కరోనా టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఈ అదనపు డోసులను పేద దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి-'సరిహద్దుల్లో యుద్ధం లేదు, శాంతి లేదు'