కరోనా టీకాలపై భారత్ బయోటెక్, సీరం సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దేశానికి, ప్రపంచానికి టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశాయి. కరోనా నుంచి ప్రజలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నాయి.
'టీకా పంపిణీకి భారత్ బయోటెక్, సీరం సంయుక్త కృషి' - COVID-19 vaccines
15:21 January 05
టీకా పంపిణీకి భారత్ బయోటెక్, సీరం సంయుక్త కృషి
దేశంలో రెండు టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపాయి. దేశానికి, ప్రపంచానికి కరోనా టీకాలు అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నాయి. ప్రజలను కరోనా నుంచి రక్షించే సత్తా వ్యాక్సిన్లకు ఉందని వెల్లడించాయి.
'ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలవు'
తాము అభివృద్ధి చేసిన కరోనా టీకాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలవుని భారత్ బయోటెక్, సీరం సంస్థలు పేర్కొన్నాయి. అత్యంత నాణ్యత, భద్రతతో కూడిన టీకాలు అందిస్తామని తెలిపాయి.
వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం తమ విధిగా భావిస్తున్నమని పేర్కొన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తాయని.. టీకాల అవసరం తమకు బాగా తెలుసని చెప్పుకొచ్చాయి భారత్ బయోటెక్, సీరం సంస్థలు. ప్రపంచానికి సురక్షిత వ్యాక్సిన్లు అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.