తెలంగాణ

telangana

ETV Bharat / business

స్పుత్నిక్-వీ తయారీకి 'సీరమ్'కు అనుమతి

భారత్​లో స్పుత్నిక్-వీ టీకా ఉత్పత్తికి సీరమ్ సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చింది. కొన్ని షరతులతో అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయమై సీరమ్​ ఇన్​స్టిట్యూట్ గురువారం డీసీజీఐకు దరఖాస్తు చేసింది.

Sputnik V
స్పుత్నిక్-వీ

By

Published : Jun 5, 2021, 6:38 AM IST

భారత్​లో 'స్పుత్నిక్-వీ' కొవిడ్​ టీకాను పరీక్షలు, విశ్లేషణ కోసం ఉత్పత్తి చేసేందుకు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా(ఎస్​ఐఐ)కి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) కొన్ని షరతులతో అనుమతించినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ మేరకు డీసీజీఐ నాలుగు షరతులను విధించినట్లు వెల్లడించాయి.

మాస్కో(రష్యా)కు చెందిన ' గమాలేయా రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ' సహకారంతో (కొలాబరేషన్​).. పుణె సమీపంలోని తమ హదాప్సర్ యూనిట్​లో ఈ టీకాను అభివృద్ధి చేయాలని ఎస్​ఐఐ యోచిస్తోంది. ఈ విషయమై సీరమ్​ ఇన్​స్టిట్యూట్ గురువారం డీసీజీఐకు దరఖాస్తు చేసింది.

ఇదీ చదవండి :'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్​'​

ABOUT THE AUTHOR

...view details