తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్యాకేజీ ఇచ్చిన జోష్​- సెన్సెక్స్ 637 ప్లస్

కొవిడ్‌-19 సంక్షోభంతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 637 పాయింట్లు, నిఫ్టీ 187 పాయింట్లు వద్ద స్థిరపడ్డాయి. రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు వెల్లడించనున్నారు.

Sensex zooms over 700 points
ప్యాకేజీ ఊపుతో... లాభాలు మూటగట్టుకున్న మార్కెట్లు

By

Published : May 13, 2020, 3:40 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ ... దేశీయ మార్కెట్లలో జోష్ నింపింది. ఫలితంగా మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 637 పాయింట్లు లాభపడి 32 వేల 008 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 383 వద్ద స్థిరపడింది.

కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు.. ప్రధాని మోదీ రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల్ని ఆర్థిక శాఖ విడతలవారీగా వెల్లడించనుంది.

లాభనష్టాల్లో..

యాక్సిస్ బ్యాంకు, ఎల్​ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎమ్​ అండ్ ఎమ్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​బీఐ బ్యాంకు రాణించాయి.

నెస్లే ఇండియా, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​ నష్టపోయాయి.

ఇదీ చూడండి:ప్యాకేజీపై సర్వత్రా ఉత్కంఠ- నిధుల కేటాయింపు ఎలా?

ABOUT THE AUTHOR

...view details