తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండో రోజూ లాభాలు- సెన్సెక్స్@ 48,950 - షేర్ మార్కెట్ అప్​డేట్స్

వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 272 పాయింట్లు పెరిగి 49 వేల మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 107 పాయింట్లు బలపడింది 14,700 పైకి చేరింది.

stocks update
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్

By

Published : May 6, 2021, 3:49 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 48,950 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 14,725 వద్దకు చేరింది.

ఆటో, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. బ్యాంకింగ్ షేర్లు పుంజుకోవడం కూడా లాభాలకు మరో కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,011 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,614 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,744 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,611 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, బజాజ్ ఫిన్​సర్వ్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా నష్టాలతో ముగిశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై మినహా నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్​ సూచీలు లాభాలను గడించాయి.

ఇదీ చదవండి:ఎల్​ఐసీ పని దినాలు ఇక వారంలో ఐదే!

ABOUT THE AUTHOR

...view details