తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్ 848 పాయింట్లు వృద్ధి - షేర్ మార్కెట్ న్యూస్ తెలుగు

సోమవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 848 పాయింట్ల లాభంతో 49,600 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 14,900 పైన స్థిరపడింది. ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు భారీ లాభాలను గడించాయి.

Stocks closing News
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

By

Published : May 17, 2021, 3:44 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 848 పాయింట్ల లాభంతో 49,581 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 14,923 వద్దకు చేరింది.

బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల జోరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,606 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,923 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,931 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,725 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను గడించాయి.

భారతీ ఎయిర్​టెల్, ఎల్​&టీ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, సన్​ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, హాంకాంగ్​ సూచీలు లాభాలను నమోదు చేశాయి. నిక్కీ, కోస్పీ సూచీలు నష్టపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details