తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు ధరల తగ్గుముఖంతో పైపైకి స్టాక్​మార్కెట్లు - bse latest news

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 172 పాయింట్లు పెరిగి 40వేల 412వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధి చెంది 11వేల 910 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

sensex-surges
చమురు ధరల తగ్గుముఖంతో పైపైకి స్టాక్​మార్కెట్లు

By

Published : Dec 11, 2019, 4:56 PM IST

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం స్టాక్​మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.సెన్సెక్స్​172పాయింట్లు లాభపడి40వేల412పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ53పాయింట్లు మెరుగుపడి11వేల910పాయింట్ల వద్ద స్థిరపడింది.ప్రధానంగా ఆటో,ఐటీ,చమురు రంగ షేర్లు లాభపడ్డాయి.

ఎన్​టీపీసీ షేర్లు అత్యధికంగా2.77శాతం లాభపడగా..ఓఎన్​జీసీ,టెక్​ మహీంద్రా,కోటాక్ బ్యాంక్​,టీసీఎస్​,ఏషియన్ పెయింట్స్​,ఇండస్ఇండ్​,టాటా మోటార్స్ షేర్లు2శాతానికి పైగా వృద్ధి సాధించాయి.

ఎస్​ బ్యాంక్​ షేర్లు వరుసగా రెండో రోజూ భారీగా కుప్పకూలాయి. 15.33శాతం నష్టపోయాయి.

వేదాంత,హీరో మోటార్స్​,ఎల్ అండ్ ​టీ,భారతీ ఎయిర్​టెల్​ షేర్లు1.63శాతం క్షీణించాయి.

ఇదీ చూడండి: ఆర్థిక పునరుజ్జీవం కోసం మరింత పదునుగా సంస్కరణలు

ABOUT THE AUTHOR

...view details