తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐ భరోసాతో రాణించిన స్టాక్​మార్కెట్లు - రూపాయి విలువ

అంతర్జాతీయ సానుకూలతలకు తోడు, కరోనా ప్రభావం నుంచి మార్కెట్లు గట్టెక్కడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్​బీఐ ప్రకటించడం మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచింది. దీనితో దేశీయ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ 479 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 170 పాయింట్లు వృద్ధి చెందింది.

stock market gains
భారీగా లాభపడిన దేశీయ స్టాక్​మార్కెట్లు

By

Published : Mar 3, 2020, 3:47 PM IST

Updated : Mar 3, 2020, 4:37 PM IST

అంతర్జాతీయ సానుకూలతలకు తోడు ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకుల లాభాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు దూసుకెళ్లాయి. ఫలితంగా ఏడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 479 పాయింట్లు వృద్ధి చెంది 38 వేల 623 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్లు లాభపడి 11 వేల 303 వద్ద స్థిరపడింది.

కరోనా వైరస్ ప్రభావానికి సంబంధించి ప్రపంచ, దేశీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆర్థిక స్థిరత్వం సాధనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్​బీఐ ప్రకటించింది. దీనితో దేశీయ మార్కెట్​ సెంటిమెంట్ బలపడింది.

లాభ, నష్టాల్లో

సన్​ఫార్మా, టాటాస్టీల్​, ఓఎన్​జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్ రాణించాయి. ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఎస్​ బ్యాంకు నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లు

ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం గురించి చర్చించడానికి ఇవాళ జీ-7 దేశాల ఆర్థికమంత్రులు, కేంద్ర బ్యాంకు అధిపతులు సమావేశం అయ్యారు. ఈ భేటీతో మందగమనానికి పరిష్కారం దొరుకుతుందన్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరచాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు రాణించాయి.

షాంఘై, సియోల్ మార్కెట్లు రాణించగా, హాంకాంగ్, టోక్యో మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లు (2 శాతం) లాభాలతో ప్రారంభమయ్యాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 40 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.73.16గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 2.39 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 53.42 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఆ పాన్‌కార్డు వాడితే 10వేలు జరిమానా..!

Last Updated : Mar 3, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details