స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,411 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 29,947 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641 వద్దకు చేరింది.
కారణాలు..
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. మరోవైపు అమెరికాలో 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి అంతా సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు లాభాలకు కారణమయ్యాయి.
కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రమైన చైనాలోని హుబె రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆసియా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఈ అంశాలన్నీ మన మార్కెట్ల లాభాలకు కారణమైనట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..