తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 10:20 AM IST

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలు.. లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 40, 371వద్ద కొనసాగుతోంది. 8 పాయింట్ల వృద్ధితో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 11, 897 వద్ద ట్రేడవుతోంది.

ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -సెన్సెక్స్ 17 పాయింట్ల వృద్ధితో 40, 371వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11, 897వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు..

భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, టాటా మోటార్స్, సన్​ ఫార్మా, ఎల్​ అండ్ టీ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

యెస్​ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనీలివర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి..

అమెరికా డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు పెరిగి రూ. 71.61కి చేరింది.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

ABOUT THE AUTHOR

...view details