స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు, ఆర్థిక, ఐటీ షేర్లు... లాభాలకు దన్నుగా నిలిచాయి.
బీఎస్ఈ-సెన్సెక్స్ 511 పాయింట్లు పుంజుకుని 37,930 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 11,162 వద్ద స్థిరపడింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ సానుకూలంగా స్పందించడం వల్ల మదుపరుల సెంటిమెంట్ బలపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 37,990 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,742 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,179 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,113 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.