వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 466 పాయింట్లు వృద్ధి చెంది 36,487 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 10,764 వద్ద స్థిరపడింది.
వాహన, లోహ, ఆర్థిక రంగ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. హెవీ వెయిట్ షేర్లు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఆసియా మార్కెట్ల సానుకూలతలు కూడా లాభాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
లాభనష్టాల్లో..
ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, మారుతీ, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం 3 శాతానికిపైగా బలపడ్డాయి. దీనితో సంస్థ ఎం-క్యాప్ రూ.11.7లక్షల కోట్లు దాటింది.