స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 364 పాయింట్లు బలపడి 38,799 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,466 వద్దకు చేరింది. ఆర్థిక షేర్ల దన్ను, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు సోమవారం లాభాలకు ప్రధాన కారణం.
బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు సానుకూలంగా స్పందించడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,895 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,546 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,497 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,410 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..