తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: స్టాక్​ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్​ - crude oil price

కరోనా ఎఫెక్ట్​తో పాటు మదుపరుల లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ 164 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించింది. వాహన, ఆర్థిక రంగ షేర్లు ఇవాళ ఎక్కువ నష్టాలను నమోదు చేశాయి.

stocks
నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు

By

Published : Feb 7, 2020, 4:15 PM IST

Updated : Feb 29, 2020, 12:59 PM IST

స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు బ్రేక్​​ పడింది. కరోనా వైరస్​ భయాల​తో పాటు ఇటీవలి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడటం నేటి నష్టాలకు ప్రధాన కారణం. హెవీ వెయిట్​ షేర్లు చాలా వరకు అమ్మకాల ఒత్తిడికి లోనవడం నేటి నష్టాలకు మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 164 పాయింట్ల క్షీణతతో 41,142 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి.. 12,086 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,394 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,073 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,155 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,074 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్​, యాక్సిస్​ బ్యాంక్​, హీరోమోటార్స్ లాభాలతో ముగిశాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎం&ఎం, రిలయన్స్, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్​ నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: వడ్డీరేట్లు తగ్గించిన ఎస్​బీఐ.. మరింత చౌకగా రుణాలు

Last Updated : Feb 29, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details