తెలంగాణ

telangana

ETV Bharat / business

రివర్స్​ స్వింగ్​... భారీ లాభాల్లో స్టాక్​మార్కెట్లు - stocks starts green

సోమవారం భారీ నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ చాలా బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 537 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడ్డాయి. గల్ఫ్​ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉండడం వల్ల పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

stock market today
రివర్స్​ స్వింగ్​... భారీ లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Jan 7, 2020, 10:19 AM IST

నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్​మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈక్విటీ బెంచ్​ మార్క్​ బీఎస్​ఈ సెన్సెక్స్ ప్రారంభ సెషన్​లో దాదాపు 500 పాయింట్ల వరకు పుంజుకుంది. అమెరికా-ఇరాన్​ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 537 పాయింట్లు లాభపడి 41 వేల 214 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 154 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 417 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, రిలయన్స్, వేదాంత, జీ ఎంటర్​టైన్మెంట్, ఇండస్​ఇండ్​ బ్యాంకు, ఎస్​ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్​బీఐ, టాటా స్టీల్ రాణిస్తున్నాయి.

టెక్​ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్​, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్​​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అవసరమైతే ఇరాన్ సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యాఖ్యలను పెంటగాన్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్​ స్ట్రీట్​ కూడా నిన్న లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 20 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.71.73గా ఉంది.

దిగొచ్చిన ముడిచమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్​లో (బ్రెంట్ క్రూడ్​ ఫీచర్స్) ముడిచమురు ధర 1.20 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 68.08 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:షేర్‌ ట్రేడింగ్‌ సర్వీసుల్లోకి పేటీఎం!

ABOUT THE AUTHOR

...view details