తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరంభం భయపెట్టినా.. చివరకు అనూహ్య లాభాలు - నిఫ్టీ

వారాంతంలో స్టాక్ మార్కెట్లు అనుహ్య లాభాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్ల ప్రతికూలతలతో ఆరంభంలో కుదేలైన సూచీలు.. చివరి గంటలో ఒక్క సారిగా లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుంది.

stocks markets today
స్టాక్ మార్కెట్ వార్తలు

By

Published : Jun 12, 2020, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభాలతో ముగిశాయి. ఆరంభంలో భారీ నష్టాలతో కలవరపెట్టిన సూచీలు.. చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో నష్టాలను నుంచి తేరుకుని.. లాభాల్లోకి దూసుకెళ్లాయి.

బొంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 242 పాయింట్లు బలపడి 33,781 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 9,973 వద్ద స్థిరపడింది.

ఆటో, టెలికాం, బ్యాంకింగ్ రంగాలు ప్రధానంగా రాణించాయి. ఐటీ, ఇంధన, విద్యుత్ రంగాలు నిరాశపరిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 32,348 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,856 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,996 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 9,544 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, రిలయన్స్, టైటాన్​, బజాజ్ ఆటో, మారుతీ షేర్లు లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, పవర్​ గ్రిడ్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, టీసీఎస్​ షేర్లు నష్టాలతో ముగిశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 5 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.84 వద్ద స్థిరపడింది

ఇదీ చూడండి:రోటీపై 5% జీఎస్టీ- పరోటాపై 18%... ఎందుకిలా?

ABOUT THE AUTHOR

...view details