స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 610 పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 52,155 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లకుపైగా పెరిగి తొలిసారి 15,318 వద్ద కొనసాగుతోంది.
జనవరిలో వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 4.06 శాతానికి తగ్గటం, జీఎస్టీ వసూళ్లు, వాహన విక్రయాలు పెరగటం, డిసెంబరులో పారిశ్రామికోత్పత్తి 1 శాతం మేర పెరగటం, వంటివి మదుపరు సెంటిమెంట్ బలపరించినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నమోదువుతున్న కొనుగోళ్లతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నట్లు వివరిస్తున్నారు.
బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లు మాత్రం డీలా పడ్డాయి.