తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస నష్టాలకు చెక్​.. లాభాల్లో మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూలతలు లేనందున సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. సెన్సెక్స్​ 300 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 11 వేల 350 మార్కును అధిగమించింది.

వరుస నష్టాలకు చెక్​.. లాభాల్లో మార్కెట్లు

By

Published : Jul 25, 2019, 10:12 AM IST

వరుస నష్టాల అనంతరం స్టాక్​మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఐటీ, విద్యుత్తు రంగం మినహా బ్యాంకింగ్​, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 304 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 38 వేల 152 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 84 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 11 వేల 355 వద్ద కొనసాగుతోంది.

జులై డెరివేటివ్​ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో మదుపరులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించవచ్చని పేర్కొంటున్నారు నిపుణులు.

లాభాలు-నష్టాలు..

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​, సెయిల్​, జీ ఎంటర్​టైన్​మెంట్​, సాగర్​ సిమెంట్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​లు లాభాలు నమోదు చేశాయి. ముఖ్యంగా హెచ్​డీఎఫ్​ ట్విన్స్​, ఇన్ఫోసిస్​ మెరుగైన లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ 4 శాతంపైగా వృద్ధి చెందింది.

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​, సిండికేట్​ బ్యాంక్​, ఏసియన్​ పెయింట్స్​, బయోకాన్​, ఒబేరియో రియాల్టీ నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి మారకం...

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ.. 68.96 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details