దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు ఇవాళ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరగడమూ లాభాలకు మరో కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 1300 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 1245 పాయింట్ల లాభంతో 28,836 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 8 వేల 400 మార్కు దాటింది. 353 పాయింట్లు పెరిగి 8,437 వద్ద కొనసాగుతోంది.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 674, నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
లాభనష్టాల్లో...
ఇండస్ఇండ్ బ్యాంకు సెన్సెక్స్ ప్యాక్‌లో ఉత్తమ లాభాలు నమోదుచేసింది. దాదాపు 15 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ రాణించాయి.