తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, వాహన రంగం దన్నుతో దూసుకెళ్లిన సూచీలు

stock today
నేటి స్టాక్​మార్కెట్లు

By

Published : Apr 30, 2020, 9:29 AM IST

Updated : Apr 30, 2020, 3:54 PM IST

15:48 April 30

వారాంతంలోనూ అదే జోరు...

స్టాక్​ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 997 పాయింట్లు బలపడి 33,718 వద్ద స్థిరపడింది. నిప్టీ 306 పాయింట్ల వృద్ధితో  9,860 వద్ధకు చేరింది.

చమురు, ఐటీ, వాహన, లోహ రంగ షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్, హీరో మోటోకార్ప్, ఎన్​టీపీసీ, టీసీఎస్​, ఎం&ఎం, ఇన్ఫోసిస్​, మారుతీ, టాటా స్టీల్​ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.

సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

12:27 April 30

మిడ్​ సెషన్​లో ఊపందుకున్న సూచీలు ..

మిడ్​ సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,140 పాయింట్లకుపైగా లాభంతో 33,865 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 330 పాయింట్ల వృద్ధితో 9,883 వద్ద కొనసాగుతోంది. 

వాహన, ఐటీ, లోహ, చమురు, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

హీరోమోటోకార్ప్, మారుతీ, టైటాన్, హెచ్​సీఎల్​టెక్, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. 

30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, ఏషియన్ పెయింట్స్​ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

10:23 April 30

సెన్సెక్స్​ దూకుడు...

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1010 పాయింట్లకుపైగా లాభంతో 33,734 పాయింట్లపైకి ఎగబాకింది. నిఫ్టీ 290 పాయింట్లకు పైగా వృద్ధితో 9,854 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో హీరో మోటోకార్ప్, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం భారీ లాభాల్లో ఉన్నాయి. సన్​ఫార్మా, ఏషియన్ పెయింట్స్ మాత్రమే స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. హాంకాంగ్​, సియోల్ సూచీలు నేడు సెలవులో ఉన్నాయి.

09:08 April 30

కొనసాగుతున్న లాభాల పరంపర..

సెన్సెక్స్ 30 షేర్లు ఇలా...

స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు లాభాల పరంపర కొనసాగుతోంది. ఆర్థిక ప్యాకేజీ ఆశలకు తోడు అంతర్జాతీయంగా చాలా దేశాల్లో లాక్​డౌన్ ఎత్తివేతకు జరుగుతున్న సన్నాహాల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు.  

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా లాభంతో 33,424 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు బలపడి 9,748 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, ఐటీ, రంగ షేర్లు నేడు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. అన్ని రంగాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి.

30 ఇండెక్స్​లో అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Apr 30, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details