తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల దన్నుతో సెన్సెక్స్​ 996 ప్లస్

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు గడించాయి. సెన్సెక్స్ 996 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 286 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. బుధవారం సెషన్​లో యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 14 శాతం లాభపడ్డాయి.

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : May 27, 2020, 3:48 PM IST

బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 996 పాయింట్లు పుంజుకుని 31,605 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 286 పాయింట్ల వృద్ధితో 9,315 వద్దకు చేరింది.

ఐటీ, వాహన రంగాల్లో సానుకూలతలూ లాభాలకు ఊతమందించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

బుధవారం సెషన్​లో సెన్సెక్స్ 31,661 పాయింట్ల అత్యధిక స్థాయి, 30,525 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,331 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,004 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

సన్​ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్​, ఏషియన్ పెయింట్స్, మారుతీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 5 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.71 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:వాట్సాప్​ ద్వారా వంట గ్యాస్​ బుకింగ్ సేవలు

ABOUT THE AUTHOR

...view details