అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 600 పాయింట్లకుపైగా మెరుగుపడింది. ప్రస్తుతం 424 పాయింట్ల లాభంతో 34 వేల 711 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్సేంజి సూచీ నిఫ్టీ ఆరంభ ట్రేడింగ్‌లో 10 వేల 300 మార్కును అధిగమించింది. ప్రస్తుతం 132 పాయింట్లు పెరిగి.. 10 వేల 274 వద్ద ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లలో భారీ లాభాలూ మార్కెట్లలో జోష్ నింపుతున్నాయి.
లాభనష్టాల్లోనివివే...
ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ పుంజుకున్నాయి.