తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 3:51 PM IST

ETV Bharat / business

ప్యాకేజీపై ఆశలతో సూచీల జోరు- సెన్సెక్స్ 606 ప్లస్​

వరుసగా మూడో రోజు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నడుమ సెన్సెక్ ఏకంగా 606 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 172 పాయింట్లు పుంజుకుంది.

stock markets Telugu
స్టాక్ మార్కెట్ వార్తలు తెలుగు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 606 పాయింట్లు బలపడి 32,720 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 9,553 వద్దకు చేరింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ వస్తుందన్న ఆశలు నేటి లాభాలకు కారణమైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్​డౌన్ ఎత్తివేతకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ అంశం కూడా నేటి లాభాలకు కారకణంగా తెలుస్తోంది.

దాదాపు అన్ని రంగాలు నేడు లాభాలను గడించాయి. ఆర్థిక, ఐటీ, లోహ, టెలికాం సంస్థల షేర్లు అధికంగా లాభపడ్డాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 32,898 పాయింట్ల అత్యధిక స్థాయి, 32,172 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,599 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,392 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, ఎం&ఎం, టాటా స్టీల్​, ఎస్​బీఐ షేర్లు భారీగా లాభపడ్డాయి.

2019-20 చివరి త్రైమాసిక నష్టం కారణంగా యాక్సిస్ బ్యాంక్ 3 శాతానికిపైగా నష్టపోయింది. ఏషియన్ పెయింట్స్, హెచ్​యూఎల్​, టైటాన్, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

రూపాయి నేడు అత్యధికంగా 52 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.66కు పెరిగింది.

ఇదీ చూడండి:ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్​జెట్

ABOUT THE AUTHOR

...view details