అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా రెండో రోజూ(మంగళవారం) భారీ లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 522 పాయింట్లు పుంజుకుని 33,825 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 153 పాయింట్ల వృద్ధితో 9,979 వద్దకు చేరింది.
లాక్డౌన్ సడలింపులో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. వీటికి తోడు బ్యాంకింగ్, హెవీ వెయిట్ షేర్లు అత్యధికంగా లాభపడటమూ మార్కెట్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 33,866 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,301 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,985 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,824 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.