తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 3:45 PM IST

Updated : Oct 20, 2020, 4:48 PM IST

ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్లు భళా- సెన్సెక్స్ 449+

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 449 పాయింట్లు పుంజుకుని తిరిగి 40,400 మార్క్​ను దాటింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి..11,900కి చేరువైంది.

STOCKS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 429 పాయింట్లు బలపడి.. 40,432 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 111 పాయింట్ల వృద్ధితో 11,873 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా సానుకూల పవనాలు లాభాలకు దన్నుగా నిలిచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకోవడం వల్ల సూచీలు లాభాల్లో దూసుకెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 40,519 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,211 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,898 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,820 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

బజాజ్ ఆటో, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా నష్టపోయాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి సోమవారం 2 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.37 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.44 శాతం పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 42.74 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఉద్యోగులకు మారుతీ సుజుకీ పండుగ ఆఫర్​!

Last Updated : Oct 20, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details