తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల దూకుడు- ఏడో రోజూ లాభాల జోరు

స్టాక్ మార్కెట్లలో వరుసగా ఏడో రోజూ లాభాల జోరు కొనసాగింది. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 327 పాయింట్లు పుంజుకుని 40,500 పైకి చేరింది. నిఫ్టీ 80 పాయింట్లు బలపడి 11,900 మార్క్ దాటింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

share market news Telugu
షేర్ మార్కెట్ వార్తలు

By

Published : Oct 9, 2020, 3:48 PM IST

Updated : Oct 9, 2020, 4:28 PM IST

స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ 327 పాయింట్లు పుంజుకుని.. 40,509 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,914 వద్ద సెషన్​ను ముగించింది.

స్టాక్ మార్కెట్లు లాభాలను గడించడం వరుసగా ఇది ఏడో రోజూ కావడం విశేషం.

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ ఎంపీసీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఇందులో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పాజిటివ్ జోన్​లోకి వచ్చే అవకాశముందని రిజర్వు బ్యాంక్ అంచనా వేయడం మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచిందని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.

నేటి స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఇలా..

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,569 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,066 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,936 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,805 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎల్​&టీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే, అల్ట్రాటెక్​, హెచ్​యూఎల్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై సూచీ శుక్రవారం లాభాలను నమోదు చేసింది. టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 15 పైసలు పుంజుకుంది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.09 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.16 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.27 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:డిసెంబర్ నుంచి 24 గంటలూ ఆర్​టీజీఎస్ సేవలు

Last Updated : Oct 9, 2020, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details