తెలంగాణ

telangana

ETV Bharat / business

వారాంతంలో లాభాలు.. ఎస్​బీఐ దూకుడు - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభాలను గడించాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 113 పాయింట్లు పుంజుకుంది. శుక్రవారం సెషన్​లో ఎస్​బీఐ అత్యధికంగా దాదాపు 9 శాతం లాభం గడించింది.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 5, 2020, 3:51 PM IST

Updated : Jun 5, 2020, 3:56 PM IST

స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్​లో లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

బొంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 306 పాయింట్లు పుంజుకుని 34,287 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 113 పాయింట్ల వృద్ధితో 10,142 వద్దకు చేరింది.

మిడ్​ సెషన్ వరకు కాస్త ఉగిసలాటలో కొనసాగినా.. ఆ తర్వాత లాభాల్లో స్థిరంగా కొనసాగాయి సూచీలు. గురువారం మినహా సూచీలు ఈ వారమంతా లాభాలను నమోదు చేయడం గమనార్హం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 34,405 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,958 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,178 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,041 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ, నష్టాల్లోనివి ఇవే..

గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమసికంలో ఎస్​బీఐ లాభాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్​బీఐ షేర్లు దాదాపు 8 శాాతం పుంజుకున్నాయి. టాటా స్టీల్​, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టీసీఎస్​, హెచ్​యూఎల్​, బజాజ్ ఆటో, నెస్లే, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి స్వల్పంగా ఒక పైసా నష్టపోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.58 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:ఇప్పట్లో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉండవు!

Last Updated : Jun 5, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details