స్టాక్ మార్కెట్లకు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి.. 33,538 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 9,902 వద్ద స్థిరపడింది. ఆరంభం నుంచే ఒడుదుకులు ఎదుర్కొన్న సూచీలు ఆ తర్వాత ఏ దశలోనూ కొలుకోలేదు.
అమెరికా జీడీపీ ఈ ఏడాది 6.5 శాతం మేర క్షీణిస్తుందని.. ఫెడ్ ఇటీవల అంచనాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ మదుపరులు అప్రమత్తత పాటించి అమ్మకాలకు మొగ్గుచూపారు. వీటికి తోడు ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలను నమోదు చేయడం దేశీయ మదుపరుల్లో ప్రతికూలతలు పెంచింది. ఈ పరిణామాలన్నీ గురువారం నష్టాలకు కారణమయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,219 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,480 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,112 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 9,899 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.