స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయి.. 34,869 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 10,305 వద్దకు చేరింది.
ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. వీటికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థపై రేటింగ్ ఏజెన్సీలు ప్రతికూల అంచనాలు విడుదల చేస్తుండటం ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 35,706 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,794 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,553 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,282 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.