తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో స్టాక్​మార్కెట్లు.. కీలక రంగాల జోరు - STOCK MARKET TODAY

గురువారం ప్రారంభ ట్రేడింగ్​లో దేశీయ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. లోహ, వాహన, ఇంధన, బ్యాంకింగ్, ఇన్​ఫ్రా సహా కీలక రంగాలన్నీ రాణిస్తున్నాయి. సెన్సెక్స్​ 140 పాయింట్ల లాభంలో ఉంది. నిఫ్టీ 11 వేల 950 ఎగువన ట్రేడవుతోంది.

stock market today
లాభాల్లో స్టాక్​మార్కెట్లు.. కీలక రంగాల జోరు

By

Published : Dec 12, 2019, 10:08 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. లోహ, వాహన, ఇంధన, బ్యాంకింగ్, ఇన్​ఫ్రా సహా కీలక రంగాలన్నీ రాణిస్తున్నాయి. ఫెడ్​ సమావేశం, బ్రిటన్ ఎన్నికలు, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం స్తబ్ధుగా ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం గమనార్హం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 552 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 11 వేల 955 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఎస్​ బ్యాంకు, యూపీఎల్​, సిప్లా, టాటా మోటార్స్, వేదాంత, టాటా స్టీల్​ రాణిస్తున్నాయి.

ఓఎన్​జీసీ, జీ ఎంటర్​టైన్​మెంట్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, భారతీ ఎయిర్​టెల్, పవర్​గ్రిడ్ కార్ప్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెడ్​డీఎఫ్​సీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, షాంగై కాంపోజిట్​ నష్టాల్లో కొనసాగుతోంది.

రూపాయి విలువ

రూపాయి విలువ స్వల్పంగా పెరిగి, ఒక డాలరుకు రూ.70.69గా ఉంది.

ఇదీ చూడండి: హిమాచల ప్రదేశం.. శ్వేతవర్ణ శోభితం

ABOUT THE AUTHOR

...view details