తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేటు మార్పుపై ఉత్కంఠ.. నష్టాల్లో సూచీలు

ఆర్​బీఐ సమీక్షలో భాగంగా పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలు నేడు వెలువడనున్నాయి. వడ్డీ రేటు మార్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితంగా మదుపరుల అప్రమత్తతతో.. నేటి ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 104, నిఫ్టీ 45 పాయింట్లు పతనమయ్యాయి.

By

Published : Jun 6, 2019, 9:59 AM IST

నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సమావేశమైన ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నేడు నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్​ 104 పాయింట్లు కోల్పోయింది. 39 వేల 978 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ- నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించి 11 వేల 976 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్​లో మార్కెట్లు ఫ్లాట్​గా మొదలై... అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి.

లాభనష్టాల్లోనివివే...

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఐఓసీ, బజాజ్​ ఆటో, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ల షేర్లు లాభాల జాబితాలో ఉన్నాయి.

గెయిల్​, ఇండియా బుల్స్​ హెచ్​ఎస్​జీ, యెస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, వేదాంత, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, జీ ఎంటర్​టైన్​మెంట్​​, ఇండస్​ ఇండ్​ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ అధ్యక్షతన ఆర్థిక విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నేటితో ముగుస్తుంది. అనంతరం నూతన విధానాలను ప్రకటించనుంది ఆర్బీఐ.
గత రెండు విధాన సమీక్ష సమావేశాల్లో రెపోరేట్​ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఈసారీ రెపోరేట్​ను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు

ఆరంభ ట్రేడింగ్​లో ఆసియాకు చెందిన చైనా, జపాన్​, కొరియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ప్రారంభమయ్యాయి.

రూపాయి పతనం...

రూపాయి 13 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.39 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details