వరుసగా ఎనిమిదో రోజూ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగింది. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 84 పాయింట్లు పుంజుకుని.. 40,594 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 11,931 వద్ద స్థిరపడింది.
ఆసియా మార్కెట్ల సానుకూలతలకు తోడు.. ఐటీ సహా హెవీ వెయిట్ షేర్లు సోమవారం లాభాలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,905 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,387 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,022 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,867 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్‌టెక్, మారుతీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.