తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 540 మైనస్

అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 163 పాయింట్లు తగ్గి.. 11,800 మార్క్​ దిగువకు చేరింది. లోహ, వాహన రంగ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ముగిశాయి.

today stock markets
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Oct 26, 2020, 3:53 PM IST

Updated : Oct 28, 2020, 10:28 PM IST

వారంలో మొదటి రోజును భారీ నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సోమవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి.. 40,145 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 11,767 వద్ద సెషన్​ను ముగించింది.

అమెరికా ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం భారీగా కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయంగానూ పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రిస్క్​ ఉన్న పొజిషన్లను వదిలించుకునేందుకు ట్రేడర్లు మొగ్గు చూపడం మార్కెట్లకు భారీ నష్టాలు మిగిల్చినట్లు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్​ మధ్య ఒప్పందంపై సింగపూర్​కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టే విధించిన నేపథ్యంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. ఈ పరిణామం కూడా స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,724 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,948 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,943 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,712 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఎల్​&టీ, షేర్లు లాభాలను గడించాయి.

బజాజ్ ఆటో, ఎం&ఎం, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఎస్​బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ సూచీలు నష్టాలతో ముగిశాయి. హాంకాంగ్ స్టాక్ మార్కెట్​ సెలవులో ఉంది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 23 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.84 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 3.14 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.46 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:అమెజాన్​కు ఊరట- అంబానీ, బియానీ ఒప్పందంపై స్టే

Last Updated : Oct 28, 2020, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details