తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆద్యంతం ఊగిసలాడి ఫ్లాట్​గా ముగిసిన సూచీలు - ఆద్యంతం ఊగిసలాడి ఫ్లాట్​గా ముగిసన సూచీలు

ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్​ 17 పాయింట్లు కోల్పోయి 41 వేల 558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 12 వేల 255 వద్ద ముగిసింది. అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతలే ఇందుకు కారణం.

Sensex, Nifty end on a mixed note
ఆద్యంతం ఊగిసలాడి ఫ్లాట్​గా ముగిసన సూచీలు

By

Published : Dec 30, 2019, 4:33 PM IST

ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన దేశీయ స్టాక్​మార్కెట్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సూచనలకు తోడు.. ద్రవ్యోల్బణం పెరగడం, మందగమనం కొనసాగుతుండడం, మున్ముందు ఆర్థికవృద్ధి మరింత దిగజారుతుందనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 41 వేల 558 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 12 వేల 255 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

టాటా మోటార్స్, టాటా స్టీల్​, వేదాంత, యూపీఎల్, హీరోమోటోకార్ప్​, నెస్లే, ఎమ్​ అండ్​ ఎమ్​, భరతీ ఎయిర్​టెల్​ రాణించాయి.

ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్​ బ్యాంకు, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, కోస్పీ నష్టపోగా... హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ లాభాలను ఆర్జించాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

రూపాయి విలువ

రూపాయి ఇంట్రా డేలో ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.71.34గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్​ ధర 66.94 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: భారత్​లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని


ABOUT THE AUTHOR

...view details