స్టాక్ మార్కెట్లకు ఇవాళ మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఆరంభ ట్రేడింగ్లో జోరు చూపించిన సూచీలు అనంతరం.. తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల బాట పట్టాయి. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 8 పాయింట్ల లాభం, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 8 పాయింట్ల నష్టాన్ని నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 40 వేల 802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి.. 12 వేల 48 వద్ద ముగిసింది.
ఆటో, ప్రైవేటు బ్యాంకింగ్ రంగాల షేర్లు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.