నూతన సంవత్సరం ప్రారంభంలో దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఇంధనం, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు రాణించడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెస్సెక్స్ 52 పాయింట్లు వృద్ధిచెంది 41 వేల 306 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 12 వేల 182 వద్ద స్థిరపడింది.
లాభాల్లో
ఆదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ, వేదాంత, ఎమ్ అండ్ ఎమ్, లార్సెన్ అండ్ టుబ్రో రాణించాయి.
నష్టాల్లో
టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నష్టపోయాయి.