దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో దూకుడు ప్రదర్శించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ భారీగా 724 పాయింట్లు బలపడి.. 41,340 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 212 పాయింట్ల వృద్ధితో 12,120 వద్దకు చేరింది.
అమెరికా ఎన్నికల ఫలితాల సరళితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. ఆ ప్రభావం దేశీయంగానూ పడింది. మరోవైపు దేశీయంగా ఆర్థిక, లోహ, ఐటీ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 41,371 పాయింట్ల అత్యధిక స్థాయి, 41,030 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,131 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 12,027 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో అన్ని కంపెనీలు లాభాలను గడించాయి.