వృద్ధి మందగమనానికి మందు వేసే దిశగా ఆర్బీఐ, ఆర్థిక శాఖ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, అంతర్జాతీయంగా వీస్తున్న సానుకూల పవనాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 36,818 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల వృద్ధితో 10,898 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు...
టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.