తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ సూచీలు: కొనసాగుతున్న ఒడుదొడుకుల పర్వం - undefined

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. గురువారం నష్టాలతో ముగిసిన సూచీలు శుక్రవారం మార్కెట్ ప్రారంభంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం కొద్దిసేపటికే స్వల్ప క్షీణతతో నష్టాల బాట పట్టాయి. దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 38, 998 వద్ద కొనసాగుతోంది. 0.6 పాయింట్ల క్షీణతతో నిఫ్టీ 11,583గా ట్రేడవుతోంది.

స్టాక్ సూచీలు: కొనసాగుతున్న ఒడుదొడుకుల పర్వం

By

Published : Oct 25, 2019, 10:29 AM IST

దేశీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో 200 పాయింట్లతో దూసుకెళుతూ కనిపించిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్.. అనంతరం స్వల్ప క్షీణతకు గురయింది. సెన్సెక్స్ 21 నష్టపోయి 38, 998 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ నిఫ్టీ 0.6 పాయింట్ల క్షీణతతో నిఫ్టీ 11,583గా ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు...

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను నేడు విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ షేరు విలువ లాభాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్ షేర్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్​సీఎల్, ఓఎన్​జీసీ, హీరో, బజాజ్​ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బలపడిన రూపాయి

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 6 పైసలు లాభపడి రూ.70.96 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: దంతేరస్:​ పసిడి కొంటున్నారా.. ఈ ఐదూ సరిచూసుకోండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details