తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ లాభాలు- 46వేల మార్క్ దాటిన సెన్సెక్స్ - షేర్ మార్కెట్ వార్తలు

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి మళ్లీ 46 వేల మార్క్ దాటింది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 13,500 పైకి చేరింది. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియటం ఇది వరుసగా ఆరో వారం కావడం గమనార్హం. ఓఎన్​జీసీ అత్యధికంగా 5 శాతానికిపైగా లాభాపడింది.

share market updates
షేర్ మార్కెట్ అప్​డేట్స్

By

Published : Dec 11, 2020, 3:45 PM IST

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 139 పాయింట్లు బలపడి 46,099 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 13,513 వద్దకు చేరింది.

చమురు, విద్యుత్ షేర్లకు తోడు బ్యాంకింగ్ రంగ హెవీ వెయిట్ షేర్ల సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది. ఒకానొక దశలో భారీ లాభాలవైపు పయనించిన సూచీలు.. లాభాల స్వీకరణ కారణంగా మోస్తరు లాభాలతో సెషన్​ను ముగించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 46,310 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,706 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,579 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,402 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభ పడ్డాయి.

యాక్సిస్ బ్యాంక్, ఎం&ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:కొత్త జంటకు.. ఆర్థిక సప్తపది

ABOUT THE AUTHOR

...view details