స్టాక్‌మార్కెట్లు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. క్రితం సెషన్లో భారీ లాభాలతో ముగిసిన సూచీలు ఇవాళ్టి ట్రేడింగ్‌లోనూ సానుకూల ఫలితాలను నమోదు చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న అమెరికా సంతకం చేయనుందన్న సంకేతాలూ మార్కెట్ల జోరుకు ఓ కారణం.
బొంబాయి స్టాక్‌ఎక్స్‌చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో 200 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం 167 పాయింట్ల లాభంతో 41 వేల 619 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 12 వేల 263 వద్ద ఉంది.
ఐటీ, ఆటో, ఫార్మా, లోహ, బ్యాంకింగ్ రంగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.