తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 630 మైనస్ - షేర్ మార్కెట్ వార్తలు

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 21, 2020, 9:32 AM IST

Updated : Sep 21, 2020, 2:25 PM IST

14:19 September 21

నష్టాల్లోనూ కోటక్ బ్యాంక్ జోరు..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 630 పాయింట్లకుపైగా కోల్పోయి 38,210 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా నష్టంతో 11,259 వద్ద కొనసాగుతోంది. 

  • కోటక్ బ్యాంక్, టీసీఎస్​, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం&ఎం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:14 September 21

ఊగిసలాట ధోరణి..

స్టాక్ మార్కెట్లు లాభా నష్టాల మధ్య ఊగిసలాటలో కొనసాగుతున్నయి. అరంభంలో స్వల్ప లాభాలు నమోదు చేసిన సూచీలు.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా కోల్పోయి 38,404 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా తగ్గి.. 11,479 వద్ద కొనసాగుతోంది.

ఐటీ మినహా మిగతా ఆన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ డెరివేటివ్స్ గడువు దగ్గరపడుతుండటం, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. మార్కెట్లను ప్రభావితం చేసే దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు లేకపోవడం కూడా మార్కెట్ల స్పందనకు కారణంగా తెలుస్తోంది.

  • హెచ్​సీఎల్​టెక్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, నెస్లే, పవర్​గ్రిడ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హంకాంక్ సూచీలూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.16 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 43.22 వద్ద ఉంది.

09:07 September 21

లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం మందకొడిగా స్పందిస్తున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా లాభంతో 38,868 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల స్వల్ప లాభంతో 11,523 వద్ద కొనసాగుతోంది.

హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Sep 21, 2020, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details