తెలంగాణ

telangana

ETV Bharat / business

యూఎస్​ ఫెడ్​ రేట్ల తగ్గింపు అంచనాలతో లాభాలు

స్టాక్​మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్​కు దోహదం చేసింది. అలాగే బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల కొనుగోలు ఊపందుకోవడమూ మరో కారణం.

By

Published : Jul 31, 2019, 5:18 PM IST

యూఎస్​ ఫెడ్​ రేట్ల తగ్గింపు అంచనాలతో లాభాలు

యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, బ్యాంకింగ్, వాహనరంగ షేర్ల కొనుగోలు ఊపందుకోవడం వల్ల ఇవాళ స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

బీఎస్​ఈ సెన్సెక్ 83.88 పాయింట్లు లాభపడి (0.22 శాతం) 37 వేల 481 వద్ద ముగిసింది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ నిఫ్టీ 32.60 పాయింట్లు (0.29 శాతం) వృద్ధిచెంది 11 వేల 118 వద్ద స్థిరపడింది.

లాభాల్లోనివి...

ఎస్​ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, సన్​ఫార్మా, బజాజ్​ ఆటో, పవర్​గ్రిడ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, కోటక్​ బ్యాంకు (సుమారు 5.32 శాతం) లాభాలు ఆర్జించాయి.

నష్టాల్లోనివి...

యాక్సిస్​ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్, ఎన్​టీపీసీ, మారుతీ, టెక్ మహీంద్ర, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నష్టాలపాలయ్యాయి.
విదేశీ మదుపర్లు ఇవాళ కూడా రూ.644.59 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారని స్టాక్​ ఎక్స్ఛేంజ్​ డేటా స్పష్టం చేస్తోంది.

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు షాంఘై కాంపోజిట్, హాంగ్​ సెంగ్​, కోస్పి, నిక్కీ నష్టాలు చవిచూశాయి. యూరోపియన్ ఈక్విటీలు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి..

రూపాయి విలువ అమెరికా డాలర్​తో పోల్చితే రూ.68.84గా ఉంది.

పెరిగిన ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.82 శాతం పెరిగి బ్యారెల్ ధర 65.25 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: అఫ్గాన్​లో బాంబు పేలుడు.. 34 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details