స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 95 పాయింట్లు పుంజుకుని.. 38,068 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. స్వల్పంగా 25 పాయింట్లు పెరిగి 11,247 వద్ద సెషన్‌ను ముగించింది.
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఒకనొక దశలో భారీ లాభాలవైపూ దూసుకెళ్లాయి. ఎఫ్ఎంసీజీ షేర్లే ఎక్కువగా బుధవారం లాభాలను నమోదు చేశాయి. టెలికాం, లోహ షేర్లు నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,236 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,828 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,305 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,181 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, టైటాన్, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ రాణించాయి.