స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 601 పాయింట్లు పుంజుకుని.. 39,574 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 11,662 వద్ద స్థిరపడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఫలితంగా విదేశీ మార్కెట్లు పుంజుకోవడం.. దేశీయ సూచీలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్లో వ్యాపార కార్యకలాపాలు మెరుగైనట్లు నివేదికలు వస్తుండటం కూడా మంగళవారం లాభాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 39,624 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,191 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,680 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,564 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 8 శాతానికిపైగా లాభపడింది. ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.