తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2020, 3:49 PM IST

ETV Bharat / business

వారాంతంలో లాభాలు- 12,850పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 282 పాయింట్ల లాభంతో 43,900 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 12,850 మార్క్​ను దాటింది. బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు అత్యధికంగా 9 శాతానికిపైగా లాభపడ్డాయి.

STOCK MARKET NEWS
స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణాలు

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 282 పాయింట్ల వృద్ధితో.. 43,882 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 12,859 వద్దకు చేరింది.

వ్యాక్సిన్​పై పెరుగుతున్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి. దీనితో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. మరోవైపు భారత వృద్ధి రేటు రికవరీపై వెలువడుతున్న సానుకూల అంచనాలు కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఆర్థిక, టెలికాం, ఐటీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 44,013 పాయింట్ల అత్యధిక స్థాయి, 43,453 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 12,892 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 12,730 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్, టైటాన్, బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్​జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.

ఇదీ చూడండి:'రూ.62,600 కోట్లు కట్టాలి.. లేదంటే రాయ్​ అరెస్ట్'

ABOUT THE AUTHOR

...view details