తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడో రోజూ మార్కెట్ల పరుగు- 51,400పైకి సెన్సెక్స్

వరుసగా మూడో రోజూ స్టాక్​ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ 1,148 పాయింట్లు బలపడి.. 51,400 పైకి చేరింది. నిప్టీ 326 పాయింట్ల వృద్ధితో 15 వేల మార్క్​ దాటింది. ఆర్థిక, ఐటీ, లోహ షేర్లు బుధవారం అత్యధికంగా లాభాలను గడించాయి.

Stocks gain hugely on Wednesday
స్టాక్​ మార్కెట్లకు భారీ లాభాలు

By

Published : Mar 3, 2021, 3:42 PM IST

Updated : Mar 3, 2021, 7:55 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 1,148 పాయింట్లు బలపడి 51,445 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,246 వద్దకు చేరింది.

అమెరికా కరోనా ఉద్దీపనపై సానుకూల అంచనాలు, ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల జోరు సహా బ్యాంకింగ్, ఐటీ, లోహ షేర్లు రాణించడం వల్ల దేశీయ మార్కెట్లు ఈ స్థాయిలో పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం సెషన్​లో వాహన షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలు లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,539 అత్యధిక స్థాయిని; 50,512 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,273 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,995 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్​ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి.

బజాజ్ ఆటో, మారుతీ, ఎం&ఎం షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాలను మూటగట్టుకున్నాయి.

మూడు రోజుల్లో రూ.9.41 లక్షల కోట్ల సంపద..

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజులు భారీ లాభాలను గడించిన నేపథ్యంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే బీఎస్​ఈ నమోదిత కంపెనీల్లో మదుపరుల సంపద మూడు రోజుల్లో రూ.9.41 లక్షల కోట్లు పెరిగి.. రూ.2,10,22,227.15 కోట్లకు చేరింది. బుధవారం ఒక్క రోజే రూ.3,69,170.72 కోట్ల సంపద పెరగటం గమనార్హం.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్​, హాంకాంగ్​ సూచీలూ భారీగా లాభాలను గడించాయి.

ఇదీ చదవండి:మోయలేని భారంగా గ్యాస్‌ బండ!

Last Updated : Mar 3, 2021, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details