స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 634 పాయింట్లు తగ్గి 38,357 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 194 పాయింట్ల నష్టంతో 11,334 వద్దకు చేరింది.
అమెరికా సహా ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలపై దృష్టిసారించడం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొనగా.. బ్యాంకింగ్ షేర్లు అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,729 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,249 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,452 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,303 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..